Dho Kaminey : టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహరాశి, మహానంది, అధినేత వంటి హిట్ సినిమాలు తీసిన ఆయన వారసులు హీరోలుగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా “దో కమీనే” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. “షోలే”, “ఆర్ఆర్ఆర్” కలిపితే ఎలా ఉంటుందో అలాంటి స్క్రిప్ట్ తో ఈ సినిమా రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రాన్ని హారిక సమర్పణలో చందు క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ చంద్ర పులుగుజ్జు నిర్మిస్తున్నారు. వి.సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తస్మయి, శ్రీ రాధ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో యాక్టర్స్ శ్రీకాంత్, సుమన్, దర్శకులు బి గోపాల్, ఎఎస్ రవికుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి సుమన్ క్లాప్ నివ్వగా బి.గోపాల్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, హీరో శ్రీకాంత్ స్క్రిప్ట్ అందించారు, నందమూరి మోహనకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Read Also:HMDA Website: హైడ్రా బారిన పడకూడదంటే.. HMDA కొత్త వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేస్కోండి
ఈ సందర్భంగా డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దో కమీనే సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. నవంబర్ 3వ వారం నుంచి దో కమీనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. నిర్మాత చంద్ర పులుగుజ్జు మాట్లాడుతూ.. చంద్ర క్రియేషన్స్ బ్యానర్ లో దో కమీనే సినిమాను ఘనంగా లాంచ్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సముద్ర దర్శకత్వంలో ఒక మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం… మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు. ఈ సినిమాలో సుమన్, కన్నడ కిషోర్, సునీల్, బ్రహ్మానందం, అలీ, రవి కాలే, అజయ్ ఘోష్, బాహుబలి ప్రభాకర్, ఈశ్వరీ రావ్, గోలిసోడ మధు, ఝాన్సీ, జేఎల్ శ్రీనివాస్ తదితరులు నటించనున్నారు. ఈ సినిమాకు వినోద్ మ్యూజిక్ అందించనున్నారు.
Read Also:Balu Gani Talkies : ఆహాలో దూసుకుపోతోన్న ‘బాలు గాని టాకీస్’