ఈ మధ్యకాలంలో వార్తలు అందరికన్నా ముందు మేమే అందించాలనే ఉద్దేశంతో మీడియా సంస్థలు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మానేశాయి. ఈ నేపథ్యంలోనే, నిన్న శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర మరణించినట్లుగా బాలీవుడ్‌లో ముందు ప్రచారం మొదలైంది. అది నిజమేనని తెలుగు మీడియా పోర్టల్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాయి. అయితే, ఇదే విషయాన్ని ఖండిస్తూ ఆయన కుమార్తెలలో ఒకరైన హీరోయిన్ ఈషా డియోల్ స్పందించారు. “దయచేసి మా తండ్రి గురించి ఇలాంటి వార్తలు రాయకండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఇంతలోనే ఇలా మరణించారు అనే వార్తలు దయచేసి పుట్టించకండి” అంటూ ఆమె పేర్కొన్నారు.
Also Read : Spirit: బాక్సాఫీస్ బాడీ పల్స్ తెలిసినోడు వచ్చేశాడు
ఇక, ధర్మేంద్ర భార్య హేమమాలిని సైతం “ఇది ఏమాత్రం క్షమించరానిది” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చాలా బాధ్యతగా మెలగాల్సిన మీడియా సంస్థలు సైతం ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఇలా వార్తలు ప్రచురించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. మొత్తం మీద, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్రను బతికుండగానే మీడియా చంపేసింది. ఇక ఆయన పరిస్థితి నిలకడగా ఉండడంతో, ఈరోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు.