నేడు ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టనున్నారు అధికారులు. హై కోర్టు ఆదేశాలతో ఉదయం 11 గంటలకు అభ్యర్థులు , అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోనుంది. ఎన్నికల సంఘం ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష హాజరుకానున్నారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల 17A, 17C ఫామ్స్ తో పాటు కౌంటింగ్ సెంటర్ లోని సీసీ ఫుటేజీని కోర్టుకు పంపనున్నారు అధికారులు. 26న హైకోర్టుకి నివేదిక అధికారులు అందించనున్నారు.
Also Read : Virupaksha: ‘కాంతార’ రేంజులో రిలీజ్ చెయ్యాల్సిందే…
ఇదిలా ఉంటే.. 2018 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టును కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ ఆశ్రయించారు. దీంతో.. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు అధికారులు. అయితే.. అసెంబ్లీ సీటుకు జరిగిన ఎన్నికలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఈవీఎంలను భద్రపరిచిన నూకపల్లి బీఆర్‌కే కాలేజీలోని స్ట్రాంగ్ రూం తాళాలు మిస్సవడంతో.. తాళాలు పగులగొట్టేందుకు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. తాళాలు తీసిన తర్వాత స్ట్రాంగ్ రూంలోని ఫైళ్లు, ఈవీఎంలు తరలించేందుకు రిటర్నింగ్ అధికారి అడిగిన వాహనాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన భద్రతను కల్పించాలని సూచించిన కోర్టు.. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది.
Also Read : Agent: చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కాదు ‘కింగ్’ వస్తున్నాడు…