సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన మొదటి సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ జోనర్ లా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి ఊహించని రేంజులో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు 12 కోట్లు రాబట్టిన విరుపాక్ష సినిమా సెకండ్ డే కూడా సాలిడ్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ అయ్యే సరికి విరూపాక్ష సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వడం గ్యారెంటీ. పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయిన విరుపాక్ష మూవీ, తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యింది. కాంతార స్టైల్ లో ముందుగా ఒక్క భాషలో మాత్రమే రిలీజ్ అయ్యి, ఆ తర్వాత ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది.
పాన్ ఇండియా స్థాయిలో కాంతార సినిమా 400 కోట్లని రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు విరుపాక్ష సినిమా కూడా తెలుగులో ‘స్పయిన్ చిల్లింగ్ థ్రిల్లర్’గా పేరు తెచ్చుకుంది కాబట్టి మేకర్స్, విరుపాక్ష సినిమాని పాన్ ఇండియా మొత్తం ప్రమోట్ చేస్తే అదర్ స్టేట్స్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీపం ఉండాగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అంటారు కాబట్టి టాక్ బాగున్నప్పుడే విరుపాక్ష సినిమాని పాన్ ఇండియా మొత్తం ప్రమోట్ చెయ్యాలి. లేట్ చేస్తే జనాలు విరుపాక్ష సినిమాని మర్చిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి విరుపాక్ష సినిమా నార్త్ లో రిలీజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మరి తేజ్, విరుపాక్ష సినిమా పాన్ ఇండియాకి తీసుకోని వెళ్తాడో లేదో చూడాలి.