మంత్రిగా మారాక ధర్మాన ప్రసాదరావు తన శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి రెవిన్యూశాఖ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. నిజాయితి గల పరిపాలన ప్రజలకు ఇవ్వాలన్నారు. త్వరితగతిన సేవలు అందించాలి. దీనికోసం వ్యక్తులు లేదా వ్యవస్థలను సంస్కరించాలన్నారు.
ప్రజలనుండి రెవిన్యూ శాఖ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, రెవిన్యూ శాఖని అన్నానంటే .నేను కూడా బాధ్యుడినే. ప్రజలు విసిగిపోతున్నారని రెవిన్యూ శాఖ పై కామెంట్స్ వస్తున్నాయి. అది చెప్తే తప్పేంటి. అది సరిదిద్దుకుందాం.. అందరినీ అనడంలేదు ..కొందరినే అంటున్నా అన్నారు మంత్రి ధర్మాన. అధికారులు నా కామెంట్స్ ని అవమానంగా కంటే ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు.
భూమి మ్యూటిషన్లకోసం సైతం రోజుల తరబడి ప్రజల్ని తిప్పుతున్నారు . ముఖ్యమంత్రి సైతం అసంతృప్తిగా ఉన్నారు. అనేక మంది అధికారులు భూ రికార్డ్ లను మార్చేస్తున్నారు. భూ హక్కులు అక్రమంగా మార్చే అధికారం అధికారులుకెక్కడిది. ఎవరి భూమైనా రికార్డులు తారు మారు చేస్తే ..ప్రజలు తట్టుకోలేక చచ్చిపోతారు కదా. ఇలా చేస్తూ పోతే సంస్కరణలు చేపట్టి ఆర్డీవో, జేసీలకు అధికారం ఇచ్చేస్తాం అన్నారు.
Read Also: Telangana Congress : కీలక పరిణామం.. ఆమెను పదవి నుంచి తొలగింపు
కొన్ని రాష్ట్రాల్లో విసిగిపోయి వ్యవస్థనే మార్చేసారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలి. రెవిన్యూలో బ్రోకర్స్ కి అవకాశం ఇవ్వకండి. ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయండి , వారికి గౌరవం ఇవ్వండి. చట్టవ్యతిరేఖంగా ఏ ప్రజా ప్రతినిధి పని చేయమన్నా చేయవద్దు. నిబంధనలు ఒప్పుకోవని సుతి మెత్తగా చెప్పండని దిశానిర్దేశం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.