Site icon NTV Telugu

AP DGP: రాష్ట్రంలో ఆయా అంశాలపై డీజీపీ ఫోకస్..

Ap Dgp

Ap Dgp

నరసరావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు టార్గెట్‌గా ఉన్నాయన్నారు.. ఇటీవల ఫేక్ పోలీసులు, కోర్టులు, లాయర్లు అమాయకులకు ఫోన్లు చేసి డబ్బులు గుంజుతున్నారన్నారు..
గంజాయి, స్మగ్లింగ్‌ని పూర్తిగా అరికడతామన్నారు.. రాష్ట్రంలో సైబర్ క్రైం రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతుందని వెల్లడించారు.. టెక్నాలజీని వాడుకొని సాధ్యం అయినంత ఎక్కువ వాటిని అరికట్టాలన్నారు. చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు జరగటం తలదించుకోవాల్సిన విషయమని తెలిపారు.

READ MORE: Maha Kumbh Mela 2025: తొక్కిసలాటలో 30 మంది మృతి.. పోలీస్ శాఖ వెల్లడి

కొత్తగా సోలార్ ప్యానల్ సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు.. శాంతి భద్రతల విషయంలో టెక్నాలజీని వాడుకుంటే సత్ఫలితాలు ఉంటాయన్నారు.. డాగ్ స్వాడ్, సీసీ కెమెరాల వలన కొంత ఉపయోగం ఉందని వెల్లడించారు.. సైబర్ క్రైం రేటు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు..

READ MORE: Varun Tej: వియత్నాంలో వరుణ్ తేజ్.. ఎందుకంటే?

Exit mobile version