Varun Tej: వియత్నాంలో వరుణ్ తేజ్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. #VT15 వర్కింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వియత్నాంలో శరవేగంగా జరుగుతోందని తాజాగా టీం వెల్లడించింది. హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీతో పాటు నిర్మాతలు వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు. ఇక మరోపక్క స్క్రిప్ట్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది.
AATT: జనవరి 31న తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో ఇదే!
Also Read
అన్ని కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వరుణ్ తేజ్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీలైన్‌ను డిజైన్ చేశారు. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!