Suzuki Access 125: యాక్టివాకు పోటీగా సుజుకి పవర్ ఫుల్ స్కూటర్.. ధర ఎంతంటే?
- యాక్టివాకు పోటీగా సుజుకి పవర్ ఫుల్ స్కూటర్
- సుజుకి యాక్సెస్ 125
- స్టన్నింగ్ డిజైన్, మైలేజ్ ఫ్రెండ్లీ స్కూటర్
- ధర రూ. 81,700(ఎక్స్-షోరూమ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ సరికొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. కార్లు, బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పరిచయం చేశాయి. ఈ సందర్భంగా ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకీ తన పవర్ ఫుల్ స్కూటర్ ను ఆవిష్కరించింది. సుజుకి యాక్సెస్ 125 పేరిట నయా స్కూటర్ ను పరిచయం చేసింది. యాక్టివాకు పోటీగా తీసుకొచ్చిన ఈ స్కూటర్ స్టన్నింగ్ డిజైన్, మైలేజ్ ఫ్రెండ్లీగా ఉండనున్నది. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు కావాలనుకునే వారికి సుజుకి యాక్సెస్ 125 బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు.
సుజుకి యాక్సెస్ 125 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో వస్తుంది. మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 1, సాలిడ్ ఐస్ గ్రీన్, పర్ల్ షైనీ కలర్ ఆప్షన్లలో లభించనున్నది. కొత్త సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 81,700(ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. స్పెషల్ ఎడిషన్ ధర రూ. 88,200(ఎక్స్-షోరూమ్), రైడ్ కనెక్షన్ ఎడిషన్ ధర రూ. 93,300(ఎక్స్-షోరూమ్)గా ఉంది. సుజుకీ 125 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. సింగిల్-సిలిండర్ ఎయిర్ కూల్డ్ యూనిట్ 8.4 హెచ్‌పీ 10.2 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ సీవీటీ గేర్బాక్స్ ద్వారా పని చేస్తుంది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ఇందులో స్టైలిష్ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ యాక్సెంట్స్, ఎల్ఈడీ లైటింగ్, ఎల్సీడీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్, వాతావరణ సమాచారం, ఈటీఏ అప్ డేట్స్, బ్యాటరీ, స్పీడ్ అలర్ట్ ల గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. పొడవాటి సీటు, ఫ్లాట్ ఫుడ్ బోర్డ్, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్, డ్యుయల్ స్టోరేజ్ స్పేస్ ను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!