Devipatnam-Tiger: దేవీపట్నం ఏజెన్సీలో పులి సంచారం.. గిరిజనుల్లో భయాందోళన!
- ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం
- తీవ్ర భయాందోళనకు గురవుతున్న గిరిజనులు
- సిద్ధంగా రెస్క్యూ బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల వద్ద పులి కదలికలు గుర్తించడంతో.. గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బోడిగూడెం, డి. రావి లంక–దండంగి గ్రామాల మధ్య పులి తిరిగినట్లు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. టెలికాలర్ సాయంతో పులి ఎక్కడ సంచరిస్తోందో ట్రాక్ చేస్తున్నారు. ట్రాన్స్‌మీటర్, వీఎచ్ఎఫ్ యాంటెన్నా ద్వారా సంకేతాలు స్వీకరిస్తూ పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. రెస్క్యూ బృందాలు కూడా సిద్ధంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
Also Read: Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?
Also Read
ఇప్పటికే పులి సంచారం గుర్తించిన ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదని, పశువులను మేపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పిల్లలను, మహిళలను అడవుల వైపు పంపకుండా ఉండాలని కూడా హెచ్చరించారు. పులి సంచారం నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పులిని అడవుల్లోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?