Devara : ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత కొరటాద శివ దర్శకత్వంతో జూ.ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. పవర్ ఫుల్ ప్యాక్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం విడుదల కానుంది. జులై 3 నుంచి నెక్ట్స్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘దేవర’ మేకర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా వాడుతున్నారట తెలుస్తోంది. సినిమా గురించి రోజుకో కొత్త అప్ డేట్ ఈ చిత్రంపై భారీ అంచనాలు సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా కొత్త అప్ డేట్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర రెండు పార్టులుగా వస్తుందని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తు్న్నారట.
Read Also:Himanta Biswa Sarma: కేవలం మీడియా హైప్ కోసమే.. రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం ధ్వజం
ఎన్టీఆర్ ఆయన గతంలో ‘అదుర్స్, ఆంధ్రావాలా, నా అల్లుడు’ తదితర చిత్రాల్లో డ్యూయల్ రోల్ చేశారు. దేవర క్లైమాక్స్‌లో ‘పార్ట్ 2’కు సంబంధించిన లీడ్ ఉంటుందని, కొరటాల శివ అందుకు తగ్గట్లుగా స్టోరీ డిజైన్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. స్క్రిప్ట్ కోసమే ఆర్నెళ్లు శ్రమించిన శివ.. ప్రీప్రొడక్షన్ కోసం మరో ఆర్నెళ్లు సమయం వెచ్చించి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగారు. సినిమా మొత్తం కోస్టల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌తో పాటు ‘పార్ట్ 2’ న్యూస్ తారక్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఇక ‘దేవర’ చిత్రంతో అతిలోక సుందరి శ్రీదేశి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుంది. అలాగే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మొదటి సారి తారక్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలులాంటి మేటి టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. కాగా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ‘దేవర’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also:Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త.. ఆసియా కప్ 2023లో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా!