Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాం: ఒడిశా ముఖ్యమంత్రి
- ఒడిశా సీఎంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ
- నైనీ బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావాల్సిన అనుమతులపై చర్చ
- పూర్తిగా సహకరిస్తామని ఒడిశా సీఎం భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో ఆయన భేటీ అయ్యారు. ఒడిశాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైనీ బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావాల్సిన అనుమతుల గురించి ఆ రాష్ట్ర సీఎంతో చర్చించారు. నైనీ బొగ్గు గని కేటాయింపు, వివిధ రకాల అనుమతులు, విద్యుత్ ఉత్పత్తి, తదితర అంశాలపై వీరిద్దరు ప్రధానంగా చర్చించారు. నైనీ వద్ద సింగరేణి చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన ఒడిశా ముఖ్యమంత్రి నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని భరోసా ఇవ్వడంతో పాటు, తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: CM Revanth Reddy: ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
సింగరేణి దేశంలోని మొత్తం బొగ్గు అవసరాలలో 7.5 శాతం తీరుస్తోంది. నైనీ ప్రాజెక్టు గ్రౌండింగ్ కోసం అవసరమైన అన్ని అనుమతులు ఈ ఏడాది మార్చి 23 నాటికి వచ్చాయి. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వ మద్దతుతో జులై 4న అటవీ భూమిని సింగరేణికి అప్పగించారు. నైనీ బొగ్గు గని పూర్తి సామర్థ్యంతో పని చేసిన తర్వాత రాష్ట్ర ఖజానాకు రాయల్టీ, డీఎంఎఫ్టీ, ఇతర చట్టబద్ధమైన లెవీలతో సహా సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 1200 మందికి ఉపాధిని కల్పిస్తుంది. నైనీ బొగ్గు గనితో పాటు గని నుంచి ఉత్పత్తి చేయబడిన బొగ్గును సద్వినియోగం చేసుకోవడానికి సింగరేణి భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంగుల్ జిల్లాలో 2×800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా నెలకొల్పాలని ప్రతిపాదిస్తోంది. పవర్ ప్లాంట్ కోసం నివేదికను సిద్ధం చేస్తోంది.
తాజావార్తలు
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?