తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో ఆయన భేటీ అయ్యారు. ఒడిశాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైనీ బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావాల్సిన అనుమతుల గురించి ఆ రాష్ట్ర సీఎంతో చర్చించారు.
Odisha : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని గత ఐదు రోజుల్లో దాదాపు లక్ష మంది ప్రజలు కలిశారు. వీరిలో రాష్ట్రంలోని నలుమూలల నుండి పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఉన్నారు.
ఒడిశాలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథ దేవాలయం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయి. గురువారం ఉదయం వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రివర్గం మొత్తం హాజరయ్యారు. భవిష్యత్తులో పూరీ జగన్నాథుడిని నాలుగు ద్వారాల ద్వారా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మండలి నిర్ణయం అమలులోకి వచ్చిందన్నారు. Pawan Kalyan’s Russian Wife Anna Lezhneva: పవన్ కల్యాణ్ కి మూడో భార్యతో పరిచయం…
ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ హింజిలి అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం పట్నాయక్ కాంటాబంజీ, హింజిలి అసెంబ్లీ స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి.. ప్రధాన మంత్రి కావడం చాలా కష్టం. అలాంటిది ముఖ్యమంత్రి అయిన తరువాత సుదీర్ఘంగా కొనసాగడం ఇంకా కష్టం. కానీ ఏకంగా 5 పర్యాయాలు సీఎంగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన వ్యక్తులు అరుదుగా ఉంటారు.
ఈనెల 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో జూన్ 12న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, కార్యదర్శి సంజయ్ బెహెరా సీఎం నవీన్ పట్నాయక్‌కు తొలి టికెట్ అందజేశారు.…