అయోధ్య రామమందిర ప్రసాదాన్ని అందజేస్తామని చెబుతున్న వెబ్‌సైట్‌ను అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ వెబ్‌సైట్ ప్రజల విశ్వాసం, వారి మనోభావాల ముసుగులో మోసం చేస్తోందని, అది కూడా ఖాదీ పేరును ఉపయోగిస్తోందని జస్టిస్ సంజీవ్ నరులా ధర్మాసనం పేర్కొంది. వెబ్‌సైట్ యజమానులు సాధారణ ప్రజలను మోసం చేశారని, తీసుకున్న డబ్బుకు రసీదు లేదా ప్రసాదం చేరినట్లు ఎటువంటి రుజువు ఇవ్వలేదని కోర్టు పేర్కొంది.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో.. మరో రామ మందిరం ప్రారంభం..
కాగా.. సోషల్ మీడియా పేజీల నుంచి తమ వెబ్‌సైట్‌ను తొలగించాలని ఇద్దరు వెబ్‌సైట్ యజమానులను కోర్టు ఆదేశించింది. అలాగే, ఖాదీ ఆర్గానిక్ మార్క్ పేరుతో ఈ వెబ్‌సైట్‌ను విక్రయించడం లేదా సేవలను అందించడంపై కోర్టు నిషేధం విధించింది. ఖాదీ ఆర్గానిక్ మార్క్‌ని ఉపయోగించి సేవలను విక్రయించడం లేదా అందించడం ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.
Read Also: Ram Mandir: అయోధ్య బాలరాముడికి అత్యధిక విరాళం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా…?
అయోధ్య రామమందిర ప్రసాదం పేరుతో ఖాదీ ఆర్గానిక్ అనే బ్రాండ్‌తో వెబ్‌సైట్‌లో విక్రయించడం ప్రారంభించాడు కంపెనీ యజమాని ఆశిష్ సింగ్. అయోధ్య నుండి ఉచిత రామమందిర ప్రసాదం పొందాలనుకునే వారు ఒక ఫారమ్ నింపి రూ. 51 చెల్లించాలని వెబ్‌సైట్‌లో సామాన్యులను కోరారు. విదేశీ వినియోగదారులకు US$11 ధరను నిర్ణయించింది.