Stray Dogs: వీధికుక్కల విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలి.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray Dogs: దేశంలో ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించే ముందు కొన్ని భద్రత చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. అందులో వీధి కుక్కల్ని బంధిచడం కూడా ఒకటి. ఎందుకంటే వీధి కుక్కలు కొత్తవారిని చూసినప్పుడు లేదా ఆ ప్రాంతంలో ఏదైనా కోలాహలం జరిగినప్పుడు భయంతో మనుషుల్ని గాయపరిచిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి ప్రమాదాలను నివారించడానికి స్వాతంత్య్ర , గణతంత్ర వేడుకలు నిర్వహించేటప్పుడు, మరేదైనా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు వీధికుక్కల్ని బంధిస్తారు. కార్యక్రమం పూర్తికాగానే ఆ కుక్కల్ని వదిలేస్తారు. కాగా ఈ మధ్య G20 సదస్సును భారత్ విజయవంతగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో సదస్సుకు ముందు వీధి కుక్కల్ని బంధించారు. ఈ ఘటన పైన “అనితా శాంటియాగో ” దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా వీధి కుక్కల్ని బంధించడంపైన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
నిబంధనలు పాటించకుండా వీధి కుక్కల్ని బంధించడం అమానుషమైన చర్యగా ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కాగా బుధవారం విడుదలైన ఉత్తర్వుల ప్రకారం పౌర అధికారులు పట్టుకున్న కుక్కలను విడిచిపెట్టాలని , యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనల ప్రకారం వాటి సంక్షేమం కోసం ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అలానే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం నిర్వాహణ లో భాగంగా వీధి కుక్కల్ని బంధించేటప్పుడు అలానే కార్యక్రమం పూర్తికాగానే బంధించిన వీధి కుక్కల్ని వదిలేటప్పుడు ABC నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
అలానే కుక్కల్ని బంధించిన వెంటనే వాటికీ నంబర్లు ఉన్న కాలర్ ఇవ్వాలి. దీని ద్వారా ఆ కుక్కని ఏ ప్రాంతంలో పట్టుకున్నారు అనే విషయం సులువుగా తెలుస్తుంది. తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో వదిలిపెట్టడానికి వీలుగా ఉంటుంది. అలానే కుక్కల్ని పట్టుకున్న వెంటనే రికార్డ్స్ నిర్వహించాలి అని పిటిషన్ లో పేర్కొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది MCD సమర్పణను ధృవీకరించారు. అధికారుల వైఖరి దృష్ట్యా, పిటిషన్‌పై తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని కోర్టు తెలిపింది. పిటీషన్ లో అనితా శాంటియాగో పేర్కొన్న విధంగా వీధి కుక్కల్ని బంధించేటప్పుడు మరియు విడిచిపెటటప్పుడు ABC నిబంధనలు కచ్చితంగా పాటించాలని హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!