Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Protest: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీటీఐ (PTI) బిల్డింగ్ సమీపంలో ఆందోళన చేపట్టిన సుమారు 50 మంది నిరసనకారులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఊహించని పరిణామంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసన ప్రదర్శనలో రాకేష్ తికాయత్ వర్గానికి చెందిన కిసాన్ నేతలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి తరలించడానికి ప్రత్యేకంగా జైలు వ్యాన్ల లాంటి వాహనాలను రంగంలోకి దించారు. కొందరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ, కిందపడి లాగుతున్న దృశ్యాలు కనిపించాయి. కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వైపు దూసుకెళ్లిన ఆందోళనకారులను నిలువరించేందుకు భారీగా పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు.
గోల్ డాక్ ఖానా ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ మాట్లాడుతూ.. ఇది కేవలం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తీసుకున్న ప్రివెంటివ్ యాక్షన్ అని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతూ, ప్రజలందరూ సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఆందోళనకు అసలు కారణం ఏమిటి, రాళ్లు విసరడానికి దారితీసిన పరిస్థితులు ఏంటనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
మరోవైపు.. రాజధానిలో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో అభిజీత్ మాట్లాడూ.. “మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నాతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై ఈ ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారు” అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!