Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijit Dipke: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో అభిజీత్ మాట్లాడూ.. “మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నాతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై ఈ ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారు” అని స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఢిల్లీ పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీ వచ్చిన అభిజీత్‌ను ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో విమానం లోపల నుంచే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పోలీసులు విమానంలోకి ప్రవేశించిన సమయంలో తీవ్ర కలకలం, తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నాయి. పోలీసులు, సీజేపీ నేతల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగిన అనంతరం ఆ ముగ్గురినీ పోలీసులు రౌండప్ చేసి తీసుకెళ్లారు. పోలీసుల చర్యపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అరెస్టులను ఖండించింది. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన అభిజీత్ దిప్కే.. చివరికి ఇందిరా గాంధీ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పటి పరిస్థితి ఆనాటి కంటే దారుణంగా ఉందని మండిపడ్డారు. అరెస్టులకు తాము భయపడేది లేదని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.
Also Read
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ పరిణామాలపై సీజేపీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. సీనియర్ నాయకత్వం అందుబాటులో ఉన్నా లేకపోయినా తమ ఆందోళన ఆగదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, దేశంలోని యువత, ప్రజలంతా ముందుకు వచ్చి మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!