Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫన్నీ రైమ్ ట్రెండింగ్‌గా మారింది. సాధారణంగా చిన్న పిల్లలకు పాలు తాపడానికో, లేదంటే రైమ్స్ నేర్పడానికో వాడే ఈ కవితను ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ నిరసనకు అస్త్రంగా మలచడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ నుంచి రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. కాగా, ఆమె చిన్నపిల్లల రైమ్‌ను మార్చి పాడుతున్న ఈ సరదా వీడియోను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ వీడియోలో మమతా బెనర్జీ చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటూ ఈ రైమ్‌ను పలికారు. జానీ జానీ ఎస్ పప్పా.. ఎస్ఐఆర్ (SIR) నో పప్పా.. రాజీనామా చేయి ఎస్ పప్పా.. అరెస్ట్ చేయి ఎస్ పప్పా.. ప్రజాస్వామ్యాన్ని రక్షించు ఎస్ పప్పా.. భారత్‌ను కాపాడు ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా.. బీజేపీ ప్రభుత్వం నో పప్పా..’ అంటూ ఆమె కవిత రూపంలో తన నిరసనను గట్టిగా వినిపించారు. ఆమె పక్కనే ఉన్న టీఎంసీ నేత మహువా మొయిత్రా కూడా ఈ సరదా వ్యంగ్యాస్త్రానికి చిరునవ్వులు చిందించడం విశేషం. ఈ నిరసనల నేపథ్యంలో, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే కఠినమైన ఆంక్షలు పెట్టామని ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే.. దీది దానిని కూడా తనదైన శైలేలో తిప్పికొట్టారు. “ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ఇన్ని ఆంక్షలని మాకు నేర్పొద్దు.. రేపు శనివారం, ఈ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కదా!” అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
మొత్తానికి, ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు తన పూర్తి మద్దతు ప్రకటించారు మమతా బెనర్జీ. అయితే ఢిల్లీకి వెళ్లి నేరుగా ఆందోళనలో పాల్గొనే బదులు, కోల్‌కతాలోని గాంధీ విగ్రహం వద్దే ధర్నా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. గతంలోనూ బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ చేసిన వివిధ రకాల హావభావాలు, మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ జానీ జానీ’ రైమ్ పాలిటిక్స్ నెట్టింట మరోసారి పెద్ద చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!