Delhi Police Heroes: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో నవంబర్ 10వ తేదీ సాయంత్రం రోజులాగానే ఉంది. కానీ కొన్ని సెకన్లలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటే ఆ ప్రాంతమంతా భయంతో ఊగిపోయింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు సంభవించి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. కారు పేలుడు తర్వాత, CNG ట్యాంకుల పేలుళ్లు, పొగ, అరుపులు, గందరగోళం మొత్తం అక్కడి వాతావరణం యుద్ధభూమిని పోలి ఉంది. కానీ ఈ భయానక దృశ్యం మధ్య, ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఇద్దరు పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి డజన్ల కొద్దీ ప్రజలను రక్షించారు. వీళ్లు రియల్ లైఫ్ హీరోలు అంటే.. ఆ హీరోలు.. హెడ్ కానిస్టేబుల్ థాన్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్..
READ ALSO: Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్కూల్ టీచర్‌కు ‘‘జీవిత ఖైదు’’
ఆ టైంలో పోలీస్ స్టేషన్లో ఉన్నాం..
బాంబు పేలుడు జరిగిన తర్వాత ఢిల్లీ పోలీస్ PCRకి కాల్ వచ్చే సమయానికంటే ముందే, ఇద్దరు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. “మేము పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది” అని థాన్ సింగ్ చెప్పారు. “ఏమి జరిగిందో మాకు అర్థం కాలేదు, కానీ ఆ శబ్దం వచ్చిన దిశలోనే మేము పరిగెత్తాము” అని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, భయంకరమైన దృశ్యాన్ని చూసినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తులు, కాలిపోతున్న వాహనాలు, నిరంతర పేలుళ్లతో ఆ ప్రదేశం యుద్ధ భూమిని తలపించిందని అన్నారు.
వెంటనే ఈ ఇద్దరు పోలీసులు తమ విధి నిర్వహణలో భయం లేకుండా ముందుకు దూసుకెళ్లినట్లు తెలిపారు. థాన్ సింగ్ మాట్లాడుతూ.. “నేలపై గాయపడి ఉన్న వ్యక్తులు సహాయం కోసం కేకలు వేస్తున్నారు. కొంతమంది ఎముకలు విరిగిపోయాయి, మరికొందరు రక్తంతో తడిసిపోయారు. గాయపడిన వారిని తాకడానికి కూడా ప్రజలు చాలా భయపడ్డారు.” ఆ క్షణంలోనే మేము ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం.. వీలైనన్ని ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాలని అనుకున్నట్లు తెలిపారు.
నిమిషంలో సంఘటనా స్థలానికి చేరుకున్నాం..
వారు అంబులెన్స్ కోసం వేచి ఉండలేదు. పరిస్థితి మరింత దిగజారడం చూసి, వెంటనే గాయపడిన వారిని తీసుకొని సమీపంలోని వాహనాలు, పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. నిమిషాల్లో వారు స్వయంగా 15-20 మందికి పైగా తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. “మేము ఒక నిమిషంలో అక్కడికి చేరుకుని 12 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ప్రారంభించాము.” వాస్తవానికి పేలుడు తర్వాత కూడా CNG ట్యాంకులు పేలుతూనే ఉన్నాయి, మంటలు పెరిగాయి, కానీ ఈ ఇద్దరు పోలీసులు వెనక్కి తగ్గకుండా గాయపడిన వారిని బయటకు తీసి వారి ప్రాణాలను కాపాడారు. ఆ సమయంలో తమ మనస్సులో ఒకే ఒక విషయం ఉందని వారు చెప్పారు.. తమ ప్రాణాలు పోయినా, ప్రజల ప్రాణాలను కాపాడటం గురించే తాము ఆలోచించినట్లు చెప్పారు.
READ ALSO: Budget Smart TVs: అతి తక్కువ ధరకు స్మార్ట్ టీవీ.. ఇవే బెస్ట్ ఛాయిస్!