Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం
- తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలు దేశాధినేతలంతా హస్తినకు వచ్చారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భద్రతను సీరియస్‌గా కట్టుదిట్టం చేశారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. బాధ్యతలు మరిచి తుపాకీలతో రీల్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.
డీపక్ బంగర్ అనే కానిస్టేబుల్ నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని ఫారినర్స్ సెల్లో విధులు నిర్వహిస్తున్నారు. BRICS సదస్సు సందర్భంగా విదేశీ ప్రతినిధులు బస చేసిన రెండు ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఒకదాని పైకప్పుపై స్నైపర్ డ్యూటీకి నియమించారు. అయితే విధుల్లో ఉండగానే ఆయుధాలతో రీల్స్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ఆయన వేర్వేరు దుస్తుల్లో తుపాకులతో కనిపించారు. ఓ రీల్లో డీపక్ బంగర్ నల్లటి క్యాజువల్ షర్ట్ ధరించి లైట్ మెషిన్ గన్ చేతిలో పట్టుకుని గురిపెడుతున్నట్లుగా పోజిచ్చారు. అనంతరం కెమెరా రాత్రి సమయంలో కనిపిస్తున్న నగర దృశ్యాల వైపు తిరిగింది. మరో వీడియోలో ఆయన జేబులో పిస్టల్ పెట్టుకుని కనిపించారు. అంతేకాకుండా మెడలో BRICS సదస్సు భద్రతా విధుల కోసం జారీ చేసిన గుర్తింపు కార్డును కూడా ఉంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లాయి.
Also Read
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
రీల్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో డీపక్ బంగర్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. BRICS సదస్సు వంటి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కార్యక్రమంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయుధాలతో సోషల్ మీడియా రీల్స్ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలో జరిగిన BRICS సదస్సు
18వ BRICS సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరిగింది. BRICS కూటమికి భారత్ నాలుగోసారి అధ్యక్షత వహించింది. ఇందులో BRICS సభ్య దేశాలకు చెందిన 11 ప్రతినిధి బృందాలు, 10 భాగస్వామ్య దేశాలు, నాలుగు ప్రాంతీయ సంస్థలు, ఏడు అంతర్జాతీయ సంస్థలు సహా మొత్తం 32 ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి.
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!