Congress presidential Poll: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల పోటీలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు ఇద్దరే ఉన్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 17న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. క్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ ఓటింగ్ జరగనుంది. భారత్ జోడో యాత్రలో ఉన్న వాళ్లకోసం పోస్టల్ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. అక్టోబర్ 19వ తేదీన ఢిల్లీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు 9 వేల మందికి పైగా కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా నవంబర్, 2000లో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు. అంతకుముందు 1997లో శరద్ పవార్, రాజేష్ పైలట్లను సీతారాం కేస్రీ ఓడించారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను శశిథరూర్ ఖండించారు. తనకు ఎదురయ్యే సవాళ్ల నుంచి తానెప్పుడూ వెనక్కి తగ్గబోనని, పోటీలో చివరకు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పార్టీలోని ఇద్దరు సహచరుల మధ్య జరుగుతున్న స్నేహపూర్వక పోటీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. శశి థరూర్ నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు.
Soaps Prices: సామాన్యులకు ఊరట.. తగ్గనున్న సబ్బుల ధరలు
మరోవైపు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే శనివారం హైదరాబాద్ విచ్చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన మధ్యాహ్నం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. కొందరిని మాత్రమే బీజేపీ ధనవంతులను చేస్తోందని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నానని, తనకు ఓటేయాలని పీసీసీ సభ్యుల్ని కోరేందుకు హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. చాలా మంది సీనియర్లు తనకు మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.