Deadbody: ఇంట్లో నుంచి ఓ వివాహిత హఠాత్తుగా అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఆమె కోసం వెతకని ప్రదేశం లేదు. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈలోగా అకస్మాత్తుగా అకాల వర్షం కురిసింది. ఈ వర్షం ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పటికీ.. ఒక హత్య మిస్టరీని ఛేదించడానికి వర్షం సాయపడింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లోని గ్రేటర్ నోయిడాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. బంజరు భూమిలో పాతిపెట్టిన మహిళ మృతదేహం లభ్యమైంది. కుక్కలు మృత దేహాన్ని పీక్కుతినడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అంతకు ముందే నరేంద్ర అనే వ్యక్తి తన సోదరి కనిపించడం లేదని 15 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కట్నం కోసం అత్తమామలు తనను హత్య చేసి ఉంటారని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నరేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Balakrishna and Boyapati : బాలయ్యతో యుద్ధం చేస్తున్న బోయపాటి
ఇదిలా ఉండగా, గ్రేటర్ నోయిడాలోని సెక్టార్-155లోని భూమిలో మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఢిల్లీ ఎన్సీఆర్లో కొన్ని రోజులుగా వాతావరణం ప్రతికూలంగా ఉంది. దీంతో తుపాను కారణంగా భారీ వర్షం కురిసింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత గుంతలో పోసిన మట్టి వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో కుక్కలు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చీల్చుకు తినడం ప్రారంభించాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నాలెడ్జ్ పార్క్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పిలిచారు. ఫోరెన్సిక్ బృందం విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన వెలుగు చూసిన వెంటనే అత్తమామలు పరారీ అయ్యారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Also: KKR vs PBKS : ముగిసిన పంజాబ్ బ్యాటింగ్.. కోల్కతా టార్గెట్ 192
తన సోదరి అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని మహిళ సోదరుడు నరేంద్ర ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు. ఏడేళ్ల క్రితం 2015లో జోగిందర్ అనే యువకుడితో సరితకు వివాహమైంది. పెళ్లికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లిలో జోగీందర్కి బైక్ కూడా ఇచ్చారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే అత్తమామలు కట్నం కోసం సోదరిని వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయమై 2021లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే కుటుంబ పెద్దలు, పోలీసులు రాజీ పడ్డారు. మార్చి 8న సరిత సోదరుడు ఆమె ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. ఏదో జరిగి ఉంటుందని భయంతో ఆమె సోదరుడు మామగారి ఇంటికి ఆమెను చూడటానికి వచ్చాడు. ఈ సమయంలో ఆమె పారిపోయిందని భర్త చెప్పాడు. దీంతో భయంతో సోదరుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.