Amazfit Bip 6: 1.97 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో అమెజ్‌ఫిట్ బిప్ 6 విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazfit Bip 6: ప్రముఖ వేర్‌బుల్ బ్రాండ్ అయిన అమెజ్‌ఫిట్ తాజాగా బిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్ Amazfit Bip 6 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ వాచ్‌కి భారీ 1.97 అంగుళాల AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. ఇది ముందు ఉన్న LCD స్క్రీన్‌ని భర్తీ చేస్తూ 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు అందిస్తుంది. దీనితో పాటు, ఆటోమేటిక్ బ్రైట్‌నెస్‌కు అంబియెంట్ లైట్ సెన్సార్ కూడా కల్పించారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్‌తో బలమైన డిజైన్‌ను అందించారు. దీనిలో ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్, స్పీకర్‌తో బ్లూటూత్ కాలింగ్‌కి మద్దతు ఉంటుంది. ముందుగా ఉన్న IP68 వాటర్ రెసిస్టెన్స్‌కు బదులుగా ఇప్పుడు ఇది 5ATM (50 మీటర్ల వరకు) వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది.
Read Also: Operation Sindoor: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుపై కేంద్ర అభిప్రాయమిదే!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇందులో బిల్ట్-ఇన్ GPSతో పాటు ఐదు శాటిలైట్ సిస్టమ్స్‌కు మద్దతు ఉంటుంది. ఈ వాచ్ 140కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను కలిగి ఉంది. ఇందులో HYROX రేస్, స్మార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంకా పర్సనలైజ్డ్ AI కోచింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. సాధారణ వాడకంలో ఇది 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అమెజ్‌ఫిట్ బిప్ 6 బ్లాక్, చార్కోల్, స్టోన్, రెడ్ రంగులలో లభ్యం కానుంది. దీని ధర రూ. 7,999గా నిర్ణయించబడింది. ఇది ఈ రోజు (మే 16) మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, Amazfit India వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Read Also: Ntr-Hrithik Roshan War2: ‘వార్ 2’ అప్డేట్.. ఎన్టీఆర్ పుట్టిన రోజున టీజర్ విడుదల..!
Amazfit Bip 6 స్పెసిఫికేషన్స్:
* 1.97 అంగుళాల (390 x 450 పిక్సెల్స్) AMOLED స్క్రీన్, టెంపర్డ్ గ్లాస్, యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో
* Bluetooth 5.2 – Android 7.0 పైకి, iOS 14.0 పైకి
* బ్లూటూత్ కాలింగ్ కోసం మైక్రోఫోన్, స్పీకర్
* బ్లడ్-ఆక్సిజన్, హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటరింగ్ కోసం BioTracker PPG సెన్సార్
* GPS – ఐదు శాటిలైట్ సిస్టమ్స్
* 140+ స్పోర్ట్స్ మోడ్స్, AI కోచింగ్
* కాల్ నోటిఫికేషన్స్, మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్
* 5ATM వాటర్ రెసిస్టెన్స్
* 340mAh బ్యాటరీ: 14 రోజుల బ్యాటరీ లైఫ్, హెవీ యూజ్‌లో 6 రోజులు, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 26 రోజులు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..