సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన పట్ల వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమ్‌ను విడిచిపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేశారని, ఇది తనను చాలా బాధించిందని చెప్పాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా చాలా కాలం పాటు ఆడి, ఒక సీజన్ లో ట్రోఫీని గెలిపించినగాని.. తనకు ఈ అగౌరవం దక్కడం ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన 2023లో జరిగింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్‌ని కొనుగోలు చేసిన తర్వాత, వార్నర్ అతనిని అభినందించడానికి సోషల్ మీడియాకు వెళ్లాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన ఖాతాను సోషల్ మీడియా వేదికగా బ్లాక్ చేసిందని తెలిసి వార్నర్ షాక్ అయ్యాడు. ఆ సమయంలో సన్ రైజర్స్ తనను బ్లాక్ చేసిందని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా, అశ్విన్‌తో జరిగిన చాట్ షోలో వార్నర్ దీని గురించి మాట్లాడాడు.
సన్‌రైజర్స్ బ్లాక్ చేయడం అనేది తనకి చాలా బాధాకరమైనది., ఎందుకంటే.. ఆటగాళ్లకు సన్‌రైజర్స్ అభిమానులతో ప్రత్యేక బంధం ఉందని నేను భావిస్తున్నాను. కానీ హైదరాబాద్ నన్ను ఎందుకు బ్లాక్ చేసిందో నాకు తెలియదు అంటూ అసలు విషయాన్ని తెలిపాడు.
David Warner 🤝SRH fans 💔🥹
David Warner always will be in our hearts 💝#OrangeArmy #SRHvsMI @davidwarner31 #SunrisersHyderabad @SunRisers @SUNRISERSU #MIvsSRH pic.twitter.com/tlTwCip8RO
— SVR__TALKS (@Sai_Vardhan_13) May 6, 2024