David Warner apologizes to indian fan after Australia win in World Cup 2023: సొంత గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడిన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం ఎదురు లేకుండా చెలరేగిన రోహిత్ సేన ఫైనల్‌లో తడబడి.. కోట్లాది మంది గుండెల్ని పిండేసింది. అది కూడా 2003 ఫైనల్లో కప్‌ను లాగేసుకున్న ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని టీమిండియా ఫాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫైనల్ ముగిసి రెండు రోజలు అవుతున్నా.. అబిమానులు ఇంకా తేరుకోవడం లేదు. ఈ సమయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. తమకు ప్రపంచకప్ గెలిచినందుకు భారత అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
‘వన్డే ప్రపంచకప్ 2023 గెలిచినందుకు క్షమాపణలు చెప్తున్నా. ప్రపంచకప్ 2023 ఫైనల్ అద్బుతమైన మ్యాచ్. నరేంద్ర మోడీ స్టేడియం వాతావరణం చాలా గొప్పగా ఉంది. కప్ కోసం భారత జట్టు చాలా తీవ్రంగా ప్రయత్నించింది. అందరికీ ధన్యవాదాలు’ అని డేవిడ్ వార్నర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. తాము వందకోట్ల మంది భారతీయులను బాధ పెట్టామని, అందుకే సారీ చెప్తున్నానని డేవిడ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Govt Job: ప్రభుత్వ ఉద్యోగం కోసం.. తండ్రినే హతమార్చాలనుకున్న కుమారుడు! సినిమా మాదిరి స్కెచ్
డేవిడ్ వార్నర్ సారీ చెప్పడానికి ఓ కారణం ఉంది.ఫైనల్లో భారత్ ఓటమిని తట్టుకోలేని ఒక అభిమాని.. నువ్వు కోట్లాది మంది భారతీయుల గుండెల్ని ముక్కలు చేశావు అని వార్నర్‌కు పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన దేవ్ భాయ్.. భారతీయుల బాధను అర్ధం చేసుకొన్నాడు. ఆసీస్ ప్రపంచకప్ గెలిచినందుకు క్షమాపణలు చెప్పాడు. ఫైనల్లో వార్నర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన విషయం తెలిసిందే. భారత బ్యాటర్లు ఎటు షాట్లు ఆడినా.. బౌండరీ వెళ్లకుండా అతడు అడ్డుపడ్డాడు. వార్నర్ 5-6 బౌండరీలు ఆపాడు.
I apologise, it was such a great game and the atmosphere was incredible. India really put on a serious event. Thank you all https://t.co/5XUgHgop6b
— David Warner (@davidwarner31) November 20, 2023