Father Death: పిల్లలు పుట్టగానే ఓ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు. కన్న తండ్రిగా మారినప్పటి నుంచి వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి పరితపిస్తుంటాడు. వారిని గుండెలపై ఎత్తుకొని కాళ్లతో తంతున్న ఆనందంగా ఆడిస్తాడు. తనకంటూ జీవితం ఉందని మరిచి వారి జీవితం కోసమే అహర్నిశలు శ్రమిస్తాడు. వారిని పెంచి పెద్ద చేసి, ఉద్యోగం వచ్చే వరకు అన్నీ చూసుకొని పెళ్లి చేసి ఓ ఇంటి వారిని చేస్తాడు. కానీ అంత కష్టపడి తమను పెంచిన తండ్రి పట్లే ఓ బిడ్డలు నిర్దయగా వ్యవహరించారు. చనిపోయాడని సమాచారం తెలిపితే వారు మాట్లాడిన మాటలకు ఖాకీలే ఖంగుతిన్నాయి.
Also Read: West Bengal: చివరి కోరికగా రసగుల్లాలు ఇచ్చి మరీ స్నేహితుడిని చంపిన 8వ తరగతి విద్యార్థులు
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా చిక్కోడి ప్రాంతంలో నివసిస్తున్నాడు పుణెకు చెందిన మూల్‌చంద్ శర్మ అనే రిటైర్డు బ్యాంకు ఉద్యోగి. ఇటీవల ఆయన పక్షవాతం బారిన పడ్డారు. ఆయన కుమారుడు ఆఫ్రికాలో, కుమార్తె కెనడాలో ఉన్నారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఓ వ్యక్తి ఆయనను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స తర్వాత ఆసుపత్రికి సమీపంలోని శవనేరి అనే లాడ్జిలో ఉంచాడు. అక్కడ మూల్‌చంద్ మరింత అస్వస్థతకు లోనయ్యారు. దీంతో లాడ్జీ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి చేరుకునే సరికి శర్మ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది.
దీంతో తన కూతరు, కొడుకుకు ఫోన్ చేయమని ఆ పెద్దాయన పోలీసులకు వారి నెంబర్ ఇచ్చాడు. అతని ఆరోగ్యం గురించి వారికి తెలియచేద్దామని పోలీసులు వారికి కాల్ చేశారు. అయితే వారు లిఫ్ట్ చేయలేదు. ఇంతలో శర్మ చనిపోయారు. తరువాత ఆయన కూతురు లైన్ లోకి వచ్చి ఫోన్ చేసింది. దీంతో వారు ఆమెకు తన తండ్రి చనిపోయినట్లు తెలిపారు. అయితే ఆమె నుంచి వచ్చిన సమాధానం విని ఖాకీలే ఖంగుతిన్నారు. తండ్రి చనిపోయిన విషయం చెప్పగానే ఆ కూతురు అవునా, ఒకప్పుడు ఆయన నా తండ్రి, మేమేమైనా ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పామా అని ప్రశ్నించింది. అంతేకాకుండా వీలైతే తగలబెట్టండి, లేదంటే ఎక్కడైనా పడేయండి..మేం రాం.. అంటూ ఏ కూతురు మాట్లాడనంత కఠినంగా, కర్కశంగా మాట్లాడింది. దీంతో చేసేదేమి లేక పోలీసు వారే అన్నీ తామె ఆయనకు అంతిమ సంస్కారాలు చేశారు. ఈ వార్త తెలిసిన వారు ఆ కూతురిని తిట్టిపోస్తున్నారు. కన్న బిడ్డలు ఇలా కూడా ఉంటారా అంటూ అసహ్యించుకుంటున్నారు.