Ganga Entertainments ‘Shivam Bhaje’ Worldwide Grand Release on August 1st: చిన్న సినిమాలు అన్నీ ఒక్క సారిగా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆగస్టు రెండో తేదీన రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్, విజయ్ ఆంటోనీ తుఫాన్, వరుణ్ సందేశ్ విరాజి, శ్రీ కమల్ ఉషా పరిణయం, రాజ్ తరుణ్ తిరగబడరా సామి అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఐదు సినిమాల కంటే ఒకరోజు ముందు రిలీజ్ అవుతోంది గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ‘శివం భజే’ చిత్రం ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనున్నట్టు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ప్రకటించారు.
TG Vishwa Prasad: పీపుల్ మీడియా అధినేతకు అమెరికాలో జనసైనికుల సన్మానం
అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరో – హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ నటించారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీనా, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కర్యక్రమాలు చివరి దశలో ఉండగా ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు మేకర్స్. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత చెబుతున్నారు. ఇక దర్శకుడు అప్సర్ వైవిధ్యమైన కథకి తగ్గట్టుగా కావాల్సిన సాంకేతిక విలువలు, నిపుణులని ఖర్చుకి వెనకాడకుండా మా నిర్మాత మహేశ్వర రెడ్డి సహకారం అందించడం, ప్రతీ ఒక్కరు తమ కెరీర్ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చిందని హీరో అశ్విన్ బాబు చెబుతన్నారు.