సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఏర్పడిందని.. ప్రస్తుతం 68 ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ సేవలు అందిస్తోందని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్ర సింగ్ తెలిపారు. 1995లో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Building Collapses in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలిపోయింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం ఈరోజు (బుధవారం) కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని పోయారు.
మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుఫాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాత తుఫాను మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.