బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరానికి చేరుకునే అతి తీవ్రమైన తుఫాను ‘మోచా’తో దేశంలోని తీర ప్రాంతాలు, ఓడరేవులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మూడు ఓడరేవులు, 12 జిల్లాలకు భారీ ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాద హెచ్చరిక నం.8ను దేశ వాతావరణ కార్యాలయం జారీ చేసింది.
మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుఫాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాత తుఫాను మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టంతో అల్లాడిపోతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను రానుందని.. ఆగ్నేయ బంగాళఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.