Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Aquan Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.. ఇక, వాయుగుండం కాస్తా అక్వాన్ తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు తుఫాన్లు బీభత్సం సృష్టించగా.. ఇప్పుడు అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు, మత్స్యకారులు ఎలాంటి నష్టం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల పంటలు, మత్స్యకారుల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 23.87 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ముఖ్యంగా తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్ల పంటలను రక్షించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తుఫాన్ ప్రభావిత 16 జిల్లాల్లో 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
- Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
- Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
- AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
మత్స్యకారుల భద్రతపై కూడా మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని మొత్తం 30,808 మత్స్యకార బోట్లలో ఇప్పటికే 30,635 బోట్లు సురక్షితంగా తీరానికి చేరుకున్నాయని తెలిపారు. మిగిలిన 173 బోట్ల ఆచూకీ, భద్రతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఇప్పటివరకు మత్స్యకారులకు 1,08,250 వాయిస్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. తుఫాన్ కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లితే 24 గంటల్లో ప్రాథమిక నివేదికలు సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో రైతుల వారీగా పూర్తి వివరాలను అందించాలని స్పష్టం చేశారు. నష్టాల అంచనాలో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు. విధుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు..
తాజావార్తలు
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
-
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
-
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!