ఇటీవలే ‘మొంథా’ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీని అతలాకుతలం చేసింది. మొంథా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట అంతా నీట మునిగింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో అశుభవార్త. అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాన్‌గా మారాక సెన్‌యార్‌గా నామకరణం చేయాలని ఐఎండీ భావిస్తోంది. Also Read: YS Jagan: కడప జిల్లాలో మూడు…
Rain Alert In AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు.
Cyclone Effect: మొంథా తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. తీరానికి సమీపించే కొద్దీ దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతో పాటు తాళ్ళరేవు మండలం పైనా తుపాన్ ప్రభావం…