Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Akwan Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరో తుఫాన్ దూసుకొస్తుంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ తుఫాన్ గమనం, దిశలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీ సైక్లోన్ వ్యవస్థల ప్రభావంతో తుఫాన్ దిశ మారి మరోసారి దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే ప్రమాదం ఉందని సమాచారం. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. అనంతరం దీని ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో గాలుల తీవ్రత పెరగనుంది. తుఫాన్ తీరం వైపు దూసుకొస్తే గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా మచిలీపట్నం దిగువ ప్రాంతం మీదుగా తుఫాన్ ప్రయాణించే అవకాశం ఉందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యాంటీ సైక్లోన్ వ్యవస్థల కారణంగా తుఫాన్ ప్రయాణించే దిశలో మార్పులు రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం నవంబర్ 16 సాయంత్రానికి తుఫాన్‌గా.. నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. అనంతరం నవంబర్ 19 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక, తుఫాన్ దిశ, తీరం దాటే ప్రాంతం, గరిష్ట గాలుల వేగంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు..
Also Read
- Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
- AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Child Trafficking: బాలల అక్రమ రవాణాకు చెక్..! అదృశ్యమైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్లాన్..
- Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
తాజావార్తలు
-
Amitabh Bachchan: ‘మెగాస్టార్’ ఇంటిపై కాల్పులకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nvidia CEO Comeback: Nvidia CEOగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ? ఎలాన్ మస్క్ మద్దతు.. మళ్లీ పగ్గాలు చేపడతారా?
-
Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
-
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్‌కు రాక..!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు