Cyber Fraud : హైదరాబాద్‌లో జరిగిన రెండు భారీ సైబర్ నేరాలు నగరంలో కలకలం రేపాయి. ట్రేడింగ్ లాభాలు, డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రెండు విడతలుగా మొత్తం ₹17.77 కోట్లు కొల్లగొట్టారు. ఈ సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ట్రేడింగ్ మోసం: హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ ఒకరు ఫారెక్స్ ట్రేడింగ్‌లో మోసపోయారు. ఆగస్టులో మిత్తల్ అనే వ్యక్తి ట్రేడింగ్ బిజినెస్ పేరుతో వాట్సాప్‌లో లింక్ పంపి బాధితుడిని మోసం చేశారు. యూఎస్ డాలర్లలో పెట్టుబడులు పెట్టమని సూచించి, ₹11.11 కోట్లు 34 విడతలుగా బదిలీ చేయించారు. పైగా, విత్‌డ్రా కోసం ముందస్తు పన్ను చెల్లించాలంటూ మరింత డబ్బు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.
Youtube Auto Dubbing Feature: అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చిన యూట్యూబ్.. ఇకపై ఏ భాషలోనైనా
డిజిటల్ అరెస్టు మోసం: హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన 69 ఏళ్ల వితంతు మహిళని ట్రాయ్ అధికారులమని చెబుతూ మోసం చేశారు. ఆమె ఆధార్ కార్డు కేసులతో సంబంధముందంటూ, డిజిటల్ అరెస్టు పేరుతో ₹5.66 కోట్లు వివిధ దఫాల్లో బదిలీ చేయించారు. నిందితులు సీబీఐ అధికారులమని వీడియో కాల్ ద్వారా మహిళను నమ్మించారు. చివరకు, సీబీఐ కార్యాలయానికి వెళ్లిన బాధితులు తాము మోసపోయామని తెలుసుకున్నారు.
ఈ రెండు ఘటనలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలు ప్రజలంతా ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తున్నాయి.
KTR : రాహుల్‌కు కేటీఆర్ లేఖ..