VC Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పోలీసింగ్ సాధ్యమని, ప్రతి పౌరుడు పోలీసుగా భావించి నేరాల గురించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సజ్జనార్ పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ (ప్రజా సంక్షేమ పోలీసింగ్) అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు ప్రజల సంక్షేమంపై కూడా దృష్టి పెడతామని ఆయన…
సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పని చేయనుంది.
Cyber Fraud : హైదరాబాద్‌లో జరిగిన రెండు భారీ సైబర్ నేరాలు నగరంలో కలకలం రేపాయి. ట్రేడింగ్ లాభాలు, డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రెండు విడతలుగా మొత్తం ₹17.77 కోట్లు కొల్లగొట్టారు. ఈ సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ట్రేడింగ్ మోసం: హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ ఒకరు ఫారెక్స్ ట్రేడింగ్‌లో మోసపోయారు. ఆగస్టులో మిత్తల్ అనే వ్యక్తి ట్రేడింగ్ బిజినెస్ పేరుతో వాట్సాప్‌లో లింక్ పంపి బాధితుడిని మోసం చేశారు. యూఎస్ డాలర్లలో…