Cyber Fraud : హైదరాబాద్‌లో జరిగిన రెండు భారీ సైబర్ నేరాలు నగరంలో కలకలం రేపాయి. ట్రేడింగ్ లాభాలు, డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రెండు విడతలుగా మొత్తం ₹17.77 కోట్లు కొల్లగొట్టారు. ఈ సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ట్రేడింగ్ మోసం: హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ ఒకరు ఫారెక్స్ ట్రేడింగ్‌లో మోసపోయారు. ఆగస్టులో మిత్తల్ అనే వ్యక్తి ట్రేడింగ్ బిజినెస్ పేరుతో వాట్సాప్‌లో లింక్ పంపి బాధితుడిని మోసం చేశారు. యూఎస్ డాలర్లలో…