తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నానని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టాల్సి ఉండేదన్నారు. ఆలస్యంగా నైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారన్నారు.
తెలంగాణలో చీటింగ్.. కరప్షన్ ప్రభుత్వం ఉందని సీబ్ల్యూసీ సభ్యులు పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. యువతని మోసం చేసింది.. తెలంగాణ నిరుద్యోగంలో 15 శాతం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.