Minister KTR: వేములవాడ ను దత్తత తీసుకుంటాను, గెలిపించక పోతే ఇక్కడికి రాను అంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి, తెలంగాణ ను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాందీ ఛాలెంజ్ కి నేను సిద్దమన్నారు. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు, డిసెంబర్ నాడు చూద్దామన్నారు. హైద్రాబాద్ లో ఇడ్లీ సాంబార్ గ్యో బ్యాక్ అంటూ అప్పుడు ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ తెలంగాణ బిడ్డల్ని చంపిచారని గుర్తు చేశారు. 1968 లో తెలంగాణ కి అన్యాయం జరుగుతుంది అని మర్ల పడ్డామని అన్నారు. ముదనష్టపు కాంగ్రెస్, 370 మంది పిల్లల్ని చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2001 లో గులాబీ జెండా ఎగిరింది, 2001 నుండి 2014 వరకు అన్నం తిన్నాడో, అటుకులు బుక్కరో కేసీఆర్, ఉద్యమం చేశారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ తో నమ్మి పొత్తు పెట్టుకున్నమని, ఆ రోజుల్లో బలిదేవత సోనియా అమ్మ అని.. రేవంత్ రెడ్డి అన్నాడు, నేను అనడం లేదన్నారు. ఒక్క బేవకూఫ్ అన్నాడు. వాడు వీడు, కాంగ్రెస్ వాడు మేము తెలంగాణ ఇచ్చినాము అని అంటున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి గాడు, హౌల గాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తుండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు మా కోసం కాదు, తెలంగాణ ఆగం కావద్దన్నారు. ఇక్కడ పోరాటం నిలబడ్డ వ్యక్తి తో కాదు, కాంగ్రెస్ తో మాత్రమే పోటీ అన్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ కాదన్నారు. ఒక్క కేసీఆర్ ఎంత ఉంటాడు.. గింతంత ఉంటాడు, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడో నుండి వస్తున్నారని తెలపారు. సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపు గుంపు లుగా వస్తాయన్నారు. గిట్ల అన్నందుకు ఏమైనా కేసు పెడితే బోయిన పల్లి వినోద్ కుమార్ పై పెట్టండని అన్నారు. డికే శివ కుమార్ మన నెత్తి మీద పాలు పోసి పోయాడని, వాడు నాశనం చేసి పోయాడు, ఇక పిలవడం లేదన్నారు. బేకర్ గాల్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. గుజరాత్, ఢిల్లీ వాడు వచ్చిన కేసీఆర్ ను ఏం చేయలేరన్నారు. కేసీఆర్ ను బొండిగే పిసుకెందుకు చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిషత్ తెలంగాణ గల్లీ లోనే కావాలన్నారు. లక్ష్మీ నరసింహ రావు కోసం కాదు, కేసీఆర్ కోసమే ఆలోచన చేయాలన్నారు. డిసెంబర్ 3 నాడు లక్ష్మీ నరసింహ రావు ను గెలిపించాలని కోరారు. వేములవాడ ను దత్తత తీసుకుంటాను, గెలిపించక పోతే ఇక్కడికి రాననని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా అన్నారు. సెంటి మెంట్స్, అయింట్ మెంట్ లకు లొంగొద్దని తెలిపారు.
Virat Kohli Century: బర్త్‌డే రోజు సెంచరీ చేసింది విరాట్ ఒక్కడే కాదు.. ప్రపంచకప్ 2023లోనే మరో ప్లేయర్!