మామూలు తినే అరటి పండ్ల కన్నా ఎక్కువగా కూర అరటి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది.. కూర అరటితోనే రైతులు మంచి దిగుబడులు పొందగలుగుతున్నారని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంచనాకు మించిన దిగుబడి, ఆదాయం వస్తుండటంతో ఈ సాగు ఉత్తమం అని సూచిస్తున్నారు… కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని పండిస్తారు.. ఈ పంట గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పంట సాగుకు రూ.50 వేలకు మించని పెట్టుబడి. ప్రతీ ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు పైనే ఆదాయం వస్తుంది. కాబట్టి రైతులు దీని సాగు సులభంగా చేపట్టవచ్చు. కృత్రిమ విధానంలో సాగు చేస్తే మాత్రం అదనపు పెట్టుబడి అవుతుంది. కాబట్టి సేంద్రియ విధానానికి మొగ్గు చూపాలి.. ఇలా పండించడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే..
ఈ మొక్కలను ఎకరాకు ఎకరా భూమిలో వెయ్యి మొక్కలు నాటాలి. సాధారణంగా కూర అరటి పెద్దగా కనిపిస్తుంది. ఒక అరటి గెల దాదాపు 20 కిలోల బరువు ఉంటుంది. అంటే ఒక గెల లో 70 నుంచి 80 పైనే కాయలుంటాయి. ఆకుపచ్చరంగుతో పెద్ద సైజుతో ఉంటాయి. సాధారణ అరటితో పోలిస్తే ఇవి నీటి ఎద్దడి తెగుళ్లను తట్టుకోవడమే కాకుండా.. కోతలు చేపట్టిన తర్వాత కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. దిగుబడిలో ఆలస్యం ఉండకూడదంటే గెలను కత్తిరించిన చెట్టు అడుగున మరో మొక్కను నాటాలి.. లేదా అదే మొక్కకు వచ్చిన ఓ బలమైన పి ఉంచాలి. దీని ద్వారా మీకు దిగుబడిలో ఎలాంటి ఆలస్యం ఉండదు… వెంట వెంట మరో పంట చేతికి వస్తుంది.. వర్షాకాలంలో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.. గాలికి గెలలు పడకుండా చూసుకోవాలి.. ఈ పంట గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవడం మంచిది..