Visakhapatnam: విశాఖ సిగలో మరో పర్యాటక మణిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుంది విశాఖ పట్నం. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలతో విశాఖ పోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోర్టు డెవలప్ మెంట్ పై రాష్ట్రం ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇక కేంద్ర కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్, సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో, పలువురు మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 333.56 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రులు. ఇక విశాఖ పోర్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు క్రూయిజ్ టెర్మినల్ రెడీ అయిపోయింది.
Also Read: University Grants Commission: యూజీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి అది నిలిపివేత
Also Read
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం ఈ క్రూయిజ్ టెర్మినల్ ను రెడీ చేశారు. ఇకపై పర్యాటకులు దీనిలో వచ్చి విశాఖలో పర్యటించవచ్చు. ఈ టెర్మినల్ నిర్వహణ కోసం ఏపీ టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖలు పనిచేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. భారతదేశం ‘బ్లూ ఎకానమీ’ దిశగా అడుగులు వేస్తోందని గత నెలలో విశాకలో జరిగిన గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్)-2023 లో సర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఇక భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యాకట రంగం వృద్ధి చెందటంతో పాటు ఉద్యోగ కల్పన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!