Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో సమావేశం అవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులను కలుసుకొని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయాలపై ప్రస్తావించారు. ఫలితంగా, కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు…
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వినుకొండ మండలం శివాపురం వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో ట్రాలీ.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి వ్యవసాయ కూలీలను వినుకొండకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ…
కేంద్ర నౌకాయాన జల రవాణాశాఖా మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోనీ కేంద్ర బృందం ఇవాళ ఏపీకి రానుంది. సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం కానుంది. ఏపీలో నౌకల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటుపై సీఎంతో కేంద్ర అధికారులు మాట్లాడనున్నారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. రాష్ట్రంలో నౌకల మరమ్మత్తుల కేంద్రం నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనా. ఏటా 300 నౌకలు రీసైక్లింగ్ కోసం రానున్నాయి. ఏపీలో…
Visakhapatnam: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుంది విశాఖ పట్నం. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలతో విశాఖ పోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోర్టు డెవలప్ మెంట్ పై రాష్ట్రం ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇక కేంద్ర కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్, సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో, పలువురు…