University Grants Commission: యూజీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి అది నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
University Grants Commission: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మార్కుల షీట్, ప్రొవిజినల్ సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ను ముద్రించడానికి వీలు లేదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రవేశాలు, రిక్రూట్‌మెంట్ల విషయంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, కొన్ని సంస్థలు ఆధార్ నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలు విద్యార్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబర్లు ముద్రిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం బయటకు వెళుతుందని భావించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అలా ముద్రించడం నిలిపివేయాలని ఆదేశించింది. విద్యార్థుల ప్రైవేట్ డేటాబేస్‌ను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని యూజీసీ సెక్రటరీ ప్రొ. మనీష్ ఆర్. జోషి వెల్లడించారు.
Also Read: Telia Bhola Fish: రాత్రికి రాత్రే మారిన జాలర్ల జాతకం.. ఆ ఒక్కటి వారి జీవితాన్ని మార్చేసిందిగా
Also Read
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
ఈ మేరకు అన్ని యూనివర్సిటీలకు లేఖలు రాశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను UGC అధికారిక వెబ్‌సైట్ ugc.gov.in లో ఉంచింది. ఈ వెబ్ సైట్ లో నోటీసులు జారీ చేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచించిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాల్సిందేనని యూజీసీ యూనివర్శిటీలకు తేల్చి చెప్పంది. అందుకే విద్యార్థుల వివరాలను బహిర్గతం చేసే వివరాలను వెల్లడించకూడదని యూజీసీ ఆదేశించింది. ఇప్పటే ఆధార్ విశిష్ట నంబర్ ను అన్ని సంక్షేమ పథకాల లబ్దికోసం, అప్లికేషన్ల కోసం, రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో గుర్తింపు కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికతను నిర్థారణ చేసుకోవడానికి కూడా ఆధార్ నంబర్ ను ఉపయోగిస్తు్న్నారు. ఇక దేశంలో ఉన్న అన్ని యూనివర్శిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధీనంలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్క యూనివర్శిటి యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం యూజీసీకి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ సంస్థ ఆదేశించినట్లు విద్యార్ధుల ప్రొవిజనల్స్, మార్క్ లిస్ట్ పై ఆధార్ కార్డు నెంబర్ ను ముద్రించడం వెంటనే నిలుపుదల చేయాలి. లేదంటే అలాంటి యూనివర్శిటీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..