Rythu Runa Mafi: తెలంగాణలో రుణమాఫీ షురూ.. తొలిరోజు 44,870 మంది రైతులకు లబ్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రుణమాఫీ చెల్లింపులకు రూ.167.59 కోట్లు ఆర్థికశాఖ నుండి విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నేడు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ రైతుల తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలి.. చిట్‌చాట్‌లో భట్టి కీలక వ్యాఖ్యలు
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చిన విషయం కూడా తెలిసిందే. 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు.
Also Read: HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు
2018లో ఇచ్చిన హామీ మేరకు రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు.
.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!