కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్ల కింద సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Off The Record : కాంగ్రెస్ దెబ్బకు కారు విల విల..!
కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన పార్టీకి చెందిన కొందరు అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను 2 గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. అంతేకాక గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. చాలా సమయం పాటు వాలంటీర్లను భయాందోళనకు గురి చేశారు. ఇక జనసేన వాళ్లు బంధించిన వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉంది. తాను గర్భవతిని అని చెప్పినా కూడా జనసేన పార్టీకి చెందిన వాళ్లు కనికరించలేదు. అసలు ఏం జరిగిందంటే.. తమ తోటి వాలంటరీ పుట్టిన రోజు కావడంతో ఆరుగురు మహిళా వాలంటీర్లు మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకుని సంతోషంగా పార్టీలో గడుపుతున్నారు. ఇదే సమయంలో అక్కడి చొరపడిన జనసేన వాళ్లు దారుణంగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
MI vs RCB: రాణించిన దినేష్ కార్తీక్, డుప్లెసిస్.. ముంబై టార్గెట్ ఎంతంటే..?
ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ గ్రామీణ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారని స్థానికులు చెబుతున్నారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. ఆరుగురు వాలంటీర్లో ఏడు నెలల గర్భిణీ కూడా ఉన్న విషయాన్ని మర్చిమరీ జనసేన వాళ్లు ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారు. జనసేన దౌర్జన్యానికి ప్రగ్నెంట్ ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు అందించిన సమాచారం పోలీసులు, ఎన్నికల అధికారులు సంఘటన స్థలానికి వెళ్లారు. అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు.