కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్ల కింద సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Off The Record: కాకినాడ రూరల్ నియోజకవర్గానికి టీడీపీకి ఇన్చార్జి లేరు. ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరికీ టిక్కు పెట్టడం లేదు అధిష్ఠానం. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన విభేదాల వల్ల పిల్లి ఫ్యామిలీ టీడీపీకి దూరంగా ఉంది. పార్టీ అధినేత జిల్లాకు వచ్చినా కనీసం అటువైపు కూడా చూడలేదు కానీ.. తర్వాత టీడీపీ అధినేతను కలిసి మళ్లీ రూరల్ నియోజకవర్గంలో పిల్లి కుటుంబం తళుక్కుమంది. మాజీ ఎమ్మెల్యేకే ఇంఛార్జ్‌గా పగ్గాలు ఇస్తారని భావించినా.. టీడీపీ…
కాకినాడ జిల్లాలో పేలుడు సంభవించింది.. కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.. లారీలకు లోడు చేసే కన్వియర్ బెల్ట్ పేలినట్లు సమాచారం… ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు.. అయితే, మృతిచెందిన కార్మికుల కుటంబాలను ఆదుకోవాలని ఆందోళనకు దిగారు కార్మికులు.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఇక, ప్రమాద సమాచారం తెలుసుకున్న…
ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. గోదావరి జిల్లాలో తాగు నీటి సమస్య పెరుగుతోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.. గోదావరి చెంతనే ఉన్నా ఈ ప్రాంతాల్లో త్రాగునీటికి చింత తప్పడంలేదు. గోదావరి వాసులు త్రాగునీటి కోసం చేస్తున్న ఫీట్లు, మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు, మండుతున్న ఎండలతో గోదావరి జిల్లాల ప్రజల గొంతు ఎండుతోంది. గుక్కెడు నీళ్లు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ట్యాంకర్లు వద్ద మంచినీళ్లు పట్టుకోవడంలోనూ, సుదూర…