కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్ల కింద సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజోలు జనసేన అభ్యర్థిత్వంపై వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో.. బొంతు రాజేశ్వరరావు వర్గం రోడ్డెక్కింది. జనసేన అభ్యర్థిత్వంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. బొంతు, దేవా వర్గాలు సీటు తమదంటే తమదంటూ పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. మలికిపురంలో బొంతు రాజేశ్వరరావు ఇంటి నుంచి ఆయన వర్గం మలికిపురం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.