Crime News: సనత్‌నగర్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి కథ విషాదంగా మారింది. మొదట మిస్సింగ్‌గా నమోదైన కేసు.. తాజాగా హత్యగా పోలీసులు నిర్ధారించారు. బాధితుడిని మేనమామే ప్లాన్ చేసి హత్య చేయించిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ లోని సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసును నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసు హఠాత్తుగా మలుపు తిరిగింది.
Tollywood : యాంకర్ సుమ భర్త.. నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
అదృశ్యమైన యువకుడు తన బంధువుల అమ్మాయిని ప్రేమించి, ఆమెతో వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ అమ్మాయి మైనర్ కావడంతో యువకుడి కుటుంబం ఈ పెళ్లికి తీవ్రంగా వ్యతిరేకత తెలిపింది. అదే కోపంతో మేనమామ యువకుడిని కిడ్నాప్ చేసి, హత్య చేయించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక యువకుడి మృతదేహం మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని నర్సాపూర్ పరిధిలో గుర్తించారు అధికారులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో మరికొంతమంది పాత్ర ఉందా..? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
Rishabh Pant: బ్యాటింగ్ చేస్తుండగా తీవ్ర గాయం.. నడవలేని స్థితిలో రిషబ్ పంత్! వీడియో
“మేనమామే మా బాబుని తీసుకెళ్లి హత్య చేయించాడు… మేము పెళ్లికి అంగీకరించలేదని ఈ దుర్మార్గం చేశాడు” అంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సనత్‌నగర్ పోలీసులు ప్రస్తుతం ఈ హత్యపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులపై విచారణ ముమ్మరం చేశారు.