IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ టీమ్ కు గుండె పగిలే వార్త వచ్చింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రాం స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ను కలవర పెట్టాడు. ఇక, పరోక్షంగా తాను ఈసారి ఐపీఎల్ ఆడలేనన్న సంకేతాలను స్కై ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా, స్కై పోస్ట్ పెట్టిన సందర్భాన్ని బట్టి చూస్తే ఇదే నిజమైనట్లు సమాచారం. అయితే, గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న సూర్య జనవరిలో సర్జరీలు చేయించుకుని ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక, స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్‌సీఏ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ( NOC ) ఇవ్వాల్సి ఉంది.. కానీ, తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఎన్‌సీఏ సూర్యకుమార్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. అందుకే స్కై సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించినట్లు సమాచారం.
Read Also: Marriage scheme: పెళ్లి కానుకల కోసం కక్కుర్తి! ఓ వివాహిత ఏం చేసిందంటే..!
కాగా, ఇటీవలే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు ఎన్‌ఓసీ ఇచ్చిన ఎన్‌సీఏ.. స్కై విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో స్కై పోస్ట్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సూర్యకుమార్ చీలిమండ, స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీలను చేయించుకున్నాడు. సూర్య తాజా పోస్ట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు.
Read Also: Jayamailini: సిల్క్ స్మిత చేసిన తప్పు.. ఆమెను బలిచేసింది..
ఒకవేళ ఎన్‌సీఏ సూర్యకుమార్ యాదవ్ కు ఎన్‌ఓసీ ఇవ్వకపోతే అతను సీజన్ మొత్తానికి దూరంగా ఉంటాడా.. లేకపోతే తొలి దశ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడా అనే సందేహాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేతో ఆర్సీబీ తలపడబోతుంది. ఇక, ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ఆడబోతుంది.
Suryakumar Yadav's Instagram story. pic.twitter.com/2M7ZGBhTDN
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024