CPM Srinivasa Rao Slams AP Govt over farmers: రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే.. రాజకీయాల్లో భాగంగా నాయకులు యాత్రలు చేస్తున్నారు అని ఆంద్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. 15 సంవత్సరాలలో తీవ్ర స్థాయిలో పంటలు ఎండిపోయాయని, ఆహార ధాన్యాల కొరతతో ధరలు పెరుగుతున్నాయన్నారు. రేపటి నుచి ప్రజారక్షణ భేరి ప్రారంభం అవుతుందని, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు ఆశోక్ థావలే కర్నూలు నుంచి ప్రజారక్షణ భేరీ ప్రారంభిస్తారు అని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
నేడు విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ‘సోమవారం నుంచి ప్రజారక్షణ భేరి ప్రారంభం అవుతుంది. ఆశోక్ థావలే కర్నూలు నుంచీ ప్రజారక్షణ భేరీ ప్రారంభిస్తారు. ప్రజారక్షణ భేరీకి సంబంధించి పాటలు, పుస్తకాలు ఆవిష్కరిస్తున్నాం. 15 సంవత్సరాలలో తీవ్ర స్థాయిలో పంటలు ఎండిపోయాయి. ఆహార ధాన్యాల కొరతతో ధరలు పెరుగుతున్నాయి. ఆహార భద్రతని కాపాడుకోవడం కోసం ధాన్యం, ఇతర వస్తువులు కొనాలి’ అని అన్నారు.
Also Read: IND vs ENG: లక్నోలో కేఎల్ రాహుల్‌కు చేదు అనుభవం.. ఆటకు దూరం!
‘రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల్ని ఇంకా గురించలేదు. నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే.. రాజకీయాల్లో భాగంగా నాయకులు యాత్రలు చేస్తున్నారు. కర్ణాటక కేంద్రం బృందం వచ్చింది. మన రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు. ప్రభుత్వం ఎందుకు అడగడం లేదు. రైతులకు వడ్డి బకాయిలు రద్దు చేయాలి. పంటకి 25వేలు ఇవ్వాలి. 2లక్షలు అప్పు తీసుకొన్న వారి రుణాలు రద్దు చేయాలి. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. గిరిజన భూములను ఆదానిలకు అప్పగిస్తున్నారు. నవంబరు 15న విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం’ అని శ్రీనివాసరావు తెలిపారు.