Government Loan Schemes: మీకు తెలుసా? ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్!
- బిజినెస్ కు డబ్బు కావాలా
- ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారం రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ సంపద సృష్టించడానికి ఇదే సరైన మార్గం అంటుంటారు నిపుణులు. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే స్వయం ఉపాధి పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు పది మందికి ఉపాధి కల్పించొచ్చు. అయితే బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. డబ్బు లేకనే చాలా మంది ఆలోచన వద్దే ఆగిపోతుంటారు. మరి ఇలాంటి వారు బిజినెస్ చేసి లైఫ్ లో ఎదగడానికి ప్రభుత్వం లోన్ అందించేందుకు అద్భుతమైన స్కీమ్ లను ప్రవేశ పెట్టింది.
రుణాలు అందించే పథకాల్లో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణం పొందొచ్చు. తక్కువ వడ్డీ, సబ్సీడీ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం డబ్బులతో వ్యాపార విస్తరణ, కొత్త పరికరాలు/యంత్రాలు/సామగ్రి కొనుగోళ్లు వంటివి చేయొచ్చు.
Also Read
క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్:
ఈ పథకాన్ని MSME మంత్రిత్వ శాఖ 2000 సంవత్సరంలో ప్రారంభించింది. ఇందులో రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. 75 శాతం వరకు గ్యారెంటీ కవర్ లభిస్తుంది. మైక్రో, స్మాల్ ఎంటర్ ప్రైజెస్ సెక్టార్‌కి ఎలాంటి గ్యారంటీ లేకుండానే కేంద్రం రుణాలు ఇస్తోంది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY):
వ్యాపారం చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద, సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణాలు ఇస్తారు. వ్యవసాయేతర రంగంలో వ్యాపారం చేసే వారికి, రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఈ పథకం కింద, బ్యాంకులు, NBFCలు, MFIలు వంటి సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ఇందులో మూడు రకాల లోన్స్ శిశు, కిషోర్, తరుణ్ ఉంటాయి.
శిశు: రూ. 50,000 వరకు రుణాలు
కిషోర్: రూ. 50,000 నుంచి రూ. 5,00,000 వరకు రుణాలు
తరుణ్: రూ. 5,00,000 నుంచి, రూ. 10,00,000 వరకు రుణాలు అందిస్తారు.
స్టాండప్ ఇండియా స్కీమ్:
షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC), షెడ్యూల్డ్ ట్రైబ్ (ST), మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా, 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణాలు అందజేస్తారు. ఈ రుణాలను బ్యాంకులు అందిస్తాయి. ఈ లోన్స్ ను తయారీ, సేవలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు వంటి రంగాలకు అందిస్తారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!