ఆర్ఎంపీలను అనుభవజ్ఞులైన వైద్యులుగా గుర్తించి సర్టిఫికేట్ ఇవ్వాలంటూ అఖిలపక్ష నాయకులతో ఆర్ఎంపీ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన, లోక్ సత్తా స్ధానిక నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాధమిక వైద్య సేవలు అందించేవారు వేలల్లో ఉన్నారన్నారు. ప్రథమ చికిత్సకు పూర్తిస్ధాయి గుర్తింపు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎంపీలను వారు కోరినట్టు అనుభవజ్ఞులైన వైద్యులుగా సర్టిఫికేట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
AIMIM Jaffar Hussain: 25 సంవత్సరాల నుండి లేని ఉలుకు ఇప్పుడెందుకు మొదలైంది
రాజశేఖరరెడ్డి హాయాంలో ఆర్‌ఎంపీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. స్టేట్ ఎక్సపీరియెన్సుడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకు పైగా అనుభవజ్ఞులైన మెడికల్ ప్రాక్టిషనర్స్ ఉన్నామన్నారు. జీఓ నం.429 ద్వారా మాకు గుర్తింపు కలిగించి అనుభవజ్ఞషులైన వైద్యులుగా సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. అన్ని పార్టీల మద్దతు కోరుతూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసామని, 11న ర్యాలీ కూడా నిర్వహిస్తామన్నారు. మా సేవలు వినియోగించుకోవడమే కాకుండా గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. 68 రకాల మందులు గురించి తెలిసిన వాడు వైద్యుడు అని అన్నారు.
Supreme Court: మణిపూర్ ఇంటర్నెట్ నిలుపుదల కేసు అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కరణ