మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. విశాఖపట్నం సీల్ట్ ప్లాంట్ ను బిజెపి డంపింగ్ యార్డ్ గా మార్చబోతోందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోది హాటావో…దేశ్ బచావో నినాదంతో త్వరలో సిపిఐ అధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నాం అని ఆయన తెలిపారు. జనం మద్దతు ఉంటే ఎందుకు పోలీసుల వలయంలో తిరుగుతున్నావ్ జగన్ అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు అంత భయం జగన్ కి. కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛ గా తిరిగలేని జగన్… ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసురుతున్నాడు.
Read Also: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కష్టాలు
మోది…జగన్ ది నియంత పాలన…వీరివల్ల రాష్ట్ర నాశనం అవుతోందని విమర్శించారు నారాయణ. ఎవరు ఎలా పోటీ చేయాలో జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది…వైసిపికి ఉండేది ఒక సంవత్సవం ఆయుష్షు.. విశాఖ పట్నం సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. అవన్నీ కాకి లెక్కలు. పారిశ్రామిక కంపెనీలను తరిమేసి ఇప్పుడు పెట్టుబడులంటే ఎలా అని నారాయణ ప్రశ్నించారు. మూడు రాజధానులు అన్నప్పుడు ఏపీపై పారిశ్రానిక వేత్తలకు నమ్మకం పోయిందన్నారు నారాయణ.
Read Also: Udhayanidhi Stalin: కొత్త దంపతులు వినండి.. అన్నాడీఎంకే-బీజేపీలా ఎప్పుడూ ఉండకండి..